టాలీవుడ్ నటుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ యాక్సిడెంట్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగినట్టు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ ఎడమచేతి యొక్క మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ చికిత్స తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రోడ్డు ప్రమాదం గురించి ఆయన నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రావాల్సి ఉంది.మరోవైపు ఎన్టీఆర్ నాన్న నందమూరి హరికృష్న, ఎన్టీఆర్ సోదరుడు జానకీరామ్ వంటి వారు రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. నందమూరి కుటుంబానికి రోడ్డు ప్రమాదం ఓగండంగా మారింది. 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఎన్టీఆర్. తన అబిమాన నటుడు యాక్సిడెంట్ కు గురవ్వడం పట్ల అభిమానులు షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
0