హైదరాబాద్ వాహనదారులకు బిగ్ షాక్..నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి, ధరలు నిర్ణయించారు మెట్రో అధికారులు.బైకులు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10.. 8 గంటల వరకు రూ.25.. 12 గంటల వరకు రూ. 40 కట్టాలని సూచనలు చేయడం జరిగింది. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30.. 8 గంటల వరకు రూ.75.. 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు నిర్ణయించారు మెట్రో అధికారులు..దీంతో హైదరాబాద్ వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది.
0