manatelanganatv.com

రేపే రెండు లక్షల రుణమాఫీ

సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని రాగానే ఖమ్మం జిల్లా వైరాలో రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయనున్నారు. ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఆ నిధులను జమ చేస్తారు. దీంతో రుణమాఫీ ప్రక్రియ ముగియనుంది. రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించింది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం… మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18న మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్‌ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసింది. జులై 30న అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రభుత్వం పేర్కొంది.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278