రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీ వరకు ఎయిర్ పోర్టులో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రయాణికులతో సందర్శకులు వెళ్లేందుకు అనుమతి లేదు. విజిటర్స్ పాసులు ఆగస్టు 16 వరకు రద్దు చేశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రతిరోజు పదివేలకుపైగా విద్యార్థులు వెళ్తున్నారు. సెండ్ ఆఫ్ చేయించడానికి ఒక్క వ్యక్తికి 30 నుంచి 40 మంది వస్తున్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నెల 20వ తేదీ వరకు ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించారు.
0