బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8 2024 నాడు విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపారు. విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీ ఫర్నీచర్, అద్దాలు ద్వంసం చేశారు. క్లాసులను బంద్ చేసి విద్యార్థులతో కలిసి గ్రౌండ్ లో భైఠాయించారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ వద్దకు చేరుకున్న పేట్ బాషీరాబాద్ పోలీసులు విద్యార్థి సంఘ నేతలను మందలించే ప్రయత్నం చేశారు. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వారు కోరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.