ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా..? ఢిల్లీకి మేం రాకూడదా అని మాజీ మంత్రి
శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చాం అని క్లారిటీ ఇచ్చారు. కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారం చేయడం తగదు. ఊహాజనితంగా కథనాలు రాయడం మంచిది కాదు. ఇలాంటి కథనాలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు. 2 ఎంపీలతో బీజేపీ ప్రస్థానం మొదలైంది. అలాగని ఆ పార్టీ అక్కడితో ఆగిపోయిందా..? ఇప్పుడు మా పార్టీ కూడా అంతే. కొందరు డబ్బుకు ఆశపడి వెళ్లారు. అంతమాత్రాన పార్టీ పని అయిపోయినట్టు కాదు.ప్రజలు కూడా రైతు బంధు సహా అనేక పథకాలు ఎక్కువ ఇస్తామని చెబితే నమ్మారు. ఓటు వేశారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు. కొన్నేళ్ళ తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారు. బీఆర్ఎస్ బలహీనపడలేదు. మేం బలంగానే ఉన్నాం. ప్రజలు 39 సీట్లు ఇవ్వడం అంటే బలహీనమైనట్టు కాదు. ఇక విలీనం అన్న ప్రస్తావన అస్సలే లేదు. అది పూర్తిగా దుష్ప్రచారం అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
0