తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పెను ప్రమాదమే తప్పింది. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక బ్రిడ్జి సమీపంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రయాణిస్తున్న కారు వెనక టైరు పంచర్ అయింది.అయితే.. ఈ సంఘటనలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి ఆంధ్ర ప్రదేశ్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఈ సంఘటన జరుగగానే… తన వాహనాన్ని నిలిపివేసి మరో వాహనంలో వెళ్లారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. అటు ఎస్కార్ట్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు.
0