కూకట్ పల్లి : తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైన్నాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి భాద్యతలు చేపట్టిన బెల్లయ్య నాయక్ తేజావత్ ను మసాబ్ ట్యాంక్ లో ఉన్న దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కర్కనాగరాజు షెడ్యూల్ ట్రైబ్స్ కు సంబందించిన సమస్యలపైన చర్చించారు. గిరిజనులు, ఆదివాసులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాల్సిందిగా కార్పొరేషన్ చైర్మన్ కు కోరారు. ఈ కార్యక్రమంలో సాద మహేష్, జి.శ్రీనివాస్, కర్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.
0