కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, నూతన గృహప్రవేశం చేసిన వారు సత్యనారాయణ వ్రతం జరిపించుకోవడం ఆచారంగా వస్తోంది. సత్యనారాయణ వ్రతం వల్ల సర్వ విధాలా శుభదాయకం అని హైందవ సమాజంలో బలమైన నమ్మకం ఉంది.
కానీ కాలం మారింది. సత్యనారాయణ వ్రతం తెలుగు నుంచి ఇంగ్లీషులోకి కూడా అనువాదం అయింది. అందుకు ఈ వీడియోనే నిదర్శనం.
అమెరికాలో ఓ తెలుగు కుటుంబం సత్యనారాయణ వ్రతం ఆచరించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పురోహితుడు వ్రత మహత్మ్యాన్ని తెలుగులో కాకుండా ఇంగ్లీషులో వివరించడం ఈ వీడియోలో చూడొచ్చు. వ్రతం జరిగింది అమెరికాలో కాబట్టి పురోహితుడు ఇంగ్లీషులో చెప్పాడని సరిపెట్టుకోవాలేమో!