హైదరాబాద్లో ఆగని హత్యలు.. రోజుకో హత్య జరుగుతోంది. తాజాగా హైదరాబాద్లోని జీడిమెట్ల పరిధిలో మరో వ్యక్తి దారుణ హత్య చోటు చేసుకుంది.గుర్తు తెలియని వ్యక్తులు తలపై రాళ్లతో కొట్టి చంపారని సమాచారం అందుతోంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి లోని పారిశ్రామిక వాడ లో ఈ వ్యక్తి దారుణ హత్య చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రకటన చేశారు.నిర్మానుష్య ప్రాంతాల్లో వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల పై రాళ్ళతో కొట్టి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు….నిర్మానుష్య ప్రాంతాల్లో వ్యక్తి మృతదేహం పడేశారు. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. హత్య కు గురైన వ్యక్తి కి సుమారు 35 ఏళ్లు ఉంటుదని పోలీసులు అంచనాకు వచ్చారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
0