manatelanganatv.com

 తెలంగాణలో పోలీసుల రాజ్యం.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్

తెలంగాణలో పోలీసుల రాజ్యం కనిపిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు సెక్రటేరియట్ ముట్టడించేందుకు సర్పంచ్‌లు వెళ్లారు. అయితే పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం, తిరుమలగిరి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ విషయంపై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావు వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సంజీవ్, దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సర్పంచులు ఏం తప్పు చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయటం తప్ప అని ప్రశ్నించారు.

వడ్డీలకు తెచ్చి, గ్రామాల్లో కార్యక్రమాలు చేశారని గుర్తుచేశారు. గ్రామ పంచాయతీలకు ఒకపైసా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఢిల్లీ ఇచ్చిన రూ.500 కోట్లు కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించిందని విమర్శించారు. జ్వరాలతో జనం బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి నెల రూ.275 కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. పల్లె ప్రగతికి కూడా డబ్బులు ఇవ్వటం లేదని ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పథకం నుంచి వచ్చిన డబ్బులను ప్రభుత్వం దాచిపెట్టిందని దుయ్యబట్టారు. తమ పెండింగ్ నిధుల కోసం సర్పంచులు పోరాడితే వారిని అన్యాయంగా అరెస్టు చేసిందని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల అంశంతో పాటు వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. సర్పంచులు ధైర్యం కోల్పోకుండా ఉండాలని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రూ.1200 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం తప్పితే చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. సర్పంచులను అరెస్టు చేయడం హేయమైన చర్య తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

తమ సొంత ఖర్చులతో గ్రామ అభివృద్ధికి పాటు పడిన సర్పంచులను అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రణాళిక ఉప సంఘం, గ్రామపంచాయతీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలలో మౌలిక వసతులు కల్పించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ కుంటుపడటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఏకిపారేశారు. కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకపోవడంతో అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి ఏర్పడిందని హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

harish-rao-open-letter-to-cm-revanth-reddy
harish-rao-open-letter-to-cm-revanth-reddy

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278