తెలంగాణలో మరో నిర్భయ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళపై లైంగికదాడి జరిగింది. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే.. తెలివిగా డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది ఆ మహిళ.తనపై డ్రైవర్ అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. మేడ్చల్ సమీపంలో బస్ ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. దీంతో అప్రమత్తమైన సిటీ పోలీసులు….. బస్ కోసం గాలింంచారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0