ఎల్బీ స్టేడియంలో 30 వేల మందితో నిర్వహణ
– ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్
ఎస్సీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందని వివరించారు. ఈ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులందరితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా మాట్లాడేందుకు వచ్చేనెల రెండున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మందికి రెయిన్ ప్రూఫ్ టెంటు సౌకర్యం కల్పించాలనీ, వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు తగిన పార్కింగ్ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సమావేశ ప్రాంగణంలో కావాల్సిన మంచినీరు పారిశుధ్యం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
విజయవంతం చేయాలి : పీఆర్టీయూటీఎస్
పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సమావేశానికి వేలాదిగా వచ్చి విజయవంతం చేయాలని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు కోరారు దశాబ్ధ కాలంగా ఎదురుచూసిన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసినందున ప్రభుత్వానికి కృతజ్ఞత తెలపాల్సిన అవసరముందని తెలిపారు.
0