బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు రూ. వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసిందని ఆరోపంచర్ కేంద్రమంత్రి బండి సంజయ్. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడబోతోందని అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాల్సిందే అని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు.. గాడిద గుడ్డే అని చురకలు అంటించారు.
64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు.. గాడిద గుడ్డే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి రాకపోవడం దుర్మార్గం అని అన్నారు. భారత్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం లక్ష్యంగా నీతి అయోగ్ సమావేశం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశవాదులని అన్నారు. అవకాశమొస్తే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం ఖాయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు.