గత ప్రభుత్వం పదేళ్లలో నియామకాల విషయంలో అలసత్వం చూపిందని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో విమర్శించారు. దీంతో నిరుద్యోగ యువత ఆశలు అడుగంటి పోయాయని ధ్వజమెత్తారు. అరకొర నియామకాల ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, పేపరు లీకేజీలు, అసమర్థ పరీక్ష నిర్వహణ కారణంగా అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగ ఉద్యోగాలను సృష్టించడానికి, ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి వారికి కావాల్సిన నిధులు, మౌలిక వసతులను సమకూర్చామన్నారు. పోలీసు, వైద్య ఇతర రంగాల్లో 31,768 ఉద్యోగ నియామకాలను పూర్తి చేసి నియామకాలను అందించామన్నారు. జాబ్ క్యాలెండర్ ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.