సివిల్ సర్వీస్‌లలో దివ్యాంగుల కోటాపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం జాతీయ అధ్యక్షురాలు ఎస్ఎన్ ఉదయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు కె.బి.శ్రీధర్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ వీజీఆర్ నారగోని తదితరులు మాట్లాడారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆమె వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తున్నా, తప్పు ఒప్పుకోకపోగా, వాటిని కొనసాగించడం బాధాకరమని అన్నారు. ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు చెరుకు నాగభూషణం, భాస్కర్, శారద, శ్రీనివాస్, కిరణ్, పాల్గొన్నారు.
0