మేడ్చల్ తహసీల్దార్ పై గిర్మాపూర్ కు చెందినవారు ప్రజాపాలనలో మంగళవారం ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలోని గిర్మాపూర్ కు చెందిన బాసురాది ఉమ సర్వే నెంబర్ 41లో 8 గుంటల భూమి తన వారసత్వంగా ఉందని తెలిపారు. తన భర్త మల్లేష్ తండ్రికి బాసురాది బాలయ్య, బాసురాది మల్లేష్, బాసురాది వీరయ్య ముగ్గురు కొడుకులు వారసురాలుగా ఉన్నారన్నారు. అందులో వారసత్వంగా ముగ్గురికి వాటా ఉండగా తహసీల్దార్ డబ్బులకు అమ్ముడుపోయి మల్లేష్, కృష్ణ చనిపోవడంతో కృష్ణ భార్య అయిన కళావతికి మొత్తం భూమిని పట్టాచేసి పాస్ బుక్కులు ఇచ్చారని ఆరోపించారు. గతంలో తహశీల్దార్ అభ్యంతరాలు తెలుపుతూ లిఖితపూర్వకంగా తెలియజేసిన పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ ను ప్రశ్నిస్తే పొరపాటు జగిందని, మేము ఇప్పుడు ఏమి చేయలేమని కోర్టుకు వెళ్లండని సలహాలు ఇచ్చారన్నారు. ఇద్దరు వారసులకు పట్టా చేసే సమయంలో మా కుటుంబ సభ్యులు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. తాను ఒంటరి మహిళని, రావాల్సిన వాటాకోసం కోర్టుల చుట్టూ తిరిగే స్థోమత లేదన్నారు. తనకు అన్యాయం చేసిన తహసీల్దార్ పై చర్యలు తీసుకొని, నాకు న్యాయంగా రావాల్సిన భూమిని ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు
0