manatelanganatv.com

అక్రమ క్రషర్ ఏర్పాటను నిలిపివేయండి

జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 286 ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా క్రషర్ ఏర్పాటుకు పనులు నిర్వహిస్తున్నారని రాళ్లకత్వ గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం మండల తాసిల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమ క్రషర్ ఏర్పాటను అధికారులు తక్షణమే అడ్డుకొని నిలిపివేయాలని కోరారు. అలాగే ఈ అక్రమ క్రషర్కు పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలకు వ్యతిరేకంగా సహకరిస్తున్నారని ఆరోపించారు.. వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ఫిర్యాదును చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాళ్లకత్వ గ్రామ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278