విద్యుత్ షాక్ తో రెండు పాడి గేదెలు (బర్రెలు) మృతి చెందిన ఘటన గురువారం గుమ్మడిదల మండల పరిధిలోని నాగిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో చోటుచేసుకుంది పశు వైద్య ఇంచార్జ్ డాక్టర్ చైతన్య తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాడి గేదె రైతు గెనబోయిన బిక్షపతి తన పశువులను మేత కొరకు గ్రామంలోని పరిసరాల ప్రాంతంలకు తీసుకువెళ్లిన పశువులు మేతమేసుకుంటూ ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లగా షాక్ సర్క్యూట్ రావడంతో అక్కడే రెండు పాడి గేదెలు మృతి చెందినట్లు ధ్రువీకరించారు వాటి సుమారు అంచనా విలువ 1,50,000 వేల వరకు ఉన్నట్లు తెలిపారు మృతి చెందిన స్థలం పక్కన పశువులను పోస్టుమార్టం చేసి బాధిత రైతుకు రిపోర్టును అందించినట్లు తెలిపారు పాడి రైతు కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఎవరైనా విశాల హృదయ దాతలు నిరుపేద కుటుంబానికి సాయం అందించాలని కోరారు అసిస్టెంట్ వైద్యులు ఎస్ వీరేష్ తాజా మాజీ సర్పంచ్ గడ్డం హనుమంత్ రెడ్డి గ్రామస్తులు తదితరులు ఉన్నారు
0