ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే విభజన హామీలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి నిధులపై ప్రధానితో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చర్చించనున్నట్లు సమాచారం.