మేడ్చల్ జిల్లా: మేడ్చల్ లో బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దిపిక నరసింహారెడ్డి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రక్క ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో చైర్ పర్సన్ దీపిక కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతోపాటు మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యురాలు గీతా మధుకర్ తదితరులు కాంగ్రెస్ లో చేరారు
0