వేదం,మంత్ర శాస్త్రం అదేవిధంగా జ్యోతిష్య సిద్ధాంత భాగాల్లో జీవితకాలంలో అవిరళ కృషి చేసే శక్తి జన్మ సుకృతం చేత అతికొద్ది మందికి మాత్రమే లభించే అద్భుత అవకాశం.
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఇలాంటి అద్భతమైన విద్యల్లో నిజమైన పాండిత్యం గల నిష్ణాతులు వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
అలాగే మన తెలంగాణాలో శ్రీవిద్యా పూర్ణ దీక్షా పరులు, చండీ ఉపాసకులు శ్రీ చండీ పరమేశ్వరి పీఠాధిపతి,ప్రముఖ పంచాంగ కర్త,సిద్ధాంతి
డా.అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి గారికి న్యూ ఢిల్లీ లో జరిగిన ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ కాన్వెకేషన్ లో వేద,మంత్ర, తంత్ర జ్యోతిష శాస్త్ర పరంగా కొన్ని సంవత్సరాలుగా చేసిన విశేష కృషికి గాను ఇంటర్నేషనల్ అస్ట్రో ఎక్స్లెన్స్ అవార్డు తో పాటు జ్యోతిష భీష్మ బిరుదు తో సత్కరించారు.
అతిశరళంగా సామాన్యుడు కూడా చూసుకునేలా పంచాంగ గణన,ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు నియోజక వర్గాల వారీగా 2014,2018,2019,2023,
2024 వరకు తెలంగాణా ఆంద్ర ఎన్నికల ఫలితాలు,అలాగే ఇతర దేశంలో ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు విశేషంగా ముందే చెప్పి అందించడం.ఎందరో శిష్యుల్ని జ్యోతిషం,మంత్ర శాస్త్ర విద్యలలో తయారు చేయడం.
ప్రస్తుతం తెలంగాణా దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగ జె ఏ సీ మరియు తెలంగాణా బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ఆస్థాన సిద్ధాంతి గా ఉంటూ,తన ఆధ్వర్యంలో వందల దేవాలయ ప్రతిష్టలు,లెక్క చెప్పడానికి అవకాశంలేని ఆయుత, ప్రయుత, సహస్ర,శత చండీలు అలాగే రాజశ్యామాలాది దశ మహావిద్యాది యాగాదులు చేసిన,తన పీఠం ఆధ్వర్యంలో వేదపాఠశాలలకు, పేదవిద్యార్థులకు సాయంచేసినా కులమతాలకు అతీతంగా సామాజ సేవలను గుర్తిస్తూ ఎన్నో సంస్థలు అనేక బిరుదులు,గౌరవ డాక్టరేట్ పొందిన దేశం లోని వివిధరాష్ట్రాల జ్యోతిష పండితులు ఉన్న ఇలాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వేదికపై అవార్డు పొందడం
చాలా ఆనందం అంటూ ఇదంతా ఆ చండిపరాదేవత అనుగ్రహం అని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల జ్యోతిష పండితులు,అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.