పండిట్ పీఈటీ లచే భర్తీ చేయాలని లకిడికాపుల్ పదోన్నతులు కల్పించాలని హైదరాబాద్ లకిడికపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు డిమాండ్ చేస్తూ పండిట్, పీఈటీ లు శనివారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అదికారులు సహాసం చేసి ఉపాద్యాయులకు భారీ ఎత్తున పదోన్నతులు ఇచ్చారని, సమాఖ్య అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. అయితే పండిట్, పీఈటీల అప్ గ్రేడ్ చేస్తూ కేవలం ఆ పోస్టులలో ఎటువంటి నిబంధనలు లేకుండా పదోన్నతుల అవకాశం కల్పించాలని కోరారు. భవిష్యత్తులో పండిట్, పీఈటీ నియామకం జరగదని అయినప్పటికీ పదోన్నతులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవసరం లేకుండా అమలు చేయడం వలన, అదే విధంగా ఆయా జిల్లాలో అన్ని అప్ గ్రేడ్ పోస్టులు చూపకపోవడంతో చాలామంది పదోన్నతులు పొందలేక పోతున్నారని వాపోయారు. అవసరం లేని రూల్ రిజర్వేషన్ అమలు చేయకుండా అందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు.
0