0
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. వరి మద్దతు ధర రూ.117 పెంచి.. పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న సహా పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచాడు. ఇటీవల పెంచడంతో ధాన్యం ధర క్వింటాల్ రూ.2,300కు చేరింది. పెరిగిన ధరలు ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అధిక ధరలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు.