మేడ్చల్ మండల పరిధిలోని రావల్ కోల్ గ్రామ పరిధిలో గల 642,643 సర్వే నెంబర్ లో 5 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమి గ్రీన్ వ్యాలీ వెంచర్లో కబ్జాకు గురైందని మన తెలంగాణ టీవీలో ప్రచురించిన విషయం అందరికి తెలిసిందే. దీనికి మేడ్చల్ రెవెన్యూ శాఖ అధికారులు స్పందించారు. మంగళవారం ఎమ్మార్వో శైలజ రావల్ కోల్ గ్రామ సంబంధిత అధికారితో విషయం అడిగి తెలుసుకున్నారు. అట్టి వెంచర్ ను గతంలో సర్వే నిర్వహించి (ప్రభుత్వ స్థలం) బోర్డును నిర్వహించామని, ఇప్పుడు ఆ బోర్డును అక్కడినుండి వెంచర్ నిర్వాహకులు తొలగించారని తెలిపారు. గ్రీన్ వ్యాలీ వెంచర్ కు సంభందించిన నిర్వాహకులు వెంచర్లో కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని వేరే సర్వే నెంబర్ తో రిజిస్ట్రేషన్లు కూడా జరుపుతున్నారని తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మార్వో బుధవారం 642,643 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే తమ దృష్టికి తేవాలని, వెంచర్లో ప్రభుత్వ భూమి ఉందని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి లెటర్ పంపించారు. ఒకవేళ ప్రభుత్వ భూమిలో ప్లాట్లు నిర్వహించి విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు\
0