మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మేడ్చల్ బీఆర్ఎస్ నాయకులు సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో పేదలకు ఆహారం పంపిణీ చేశారు. వేడుకల్లో పాల్గొని రాజశేఖర్ రెడ్డి కి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పట్టణ బీఆర్ఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.