manatelanganatv.com

నిషేధిత ఆల్ఫాజోలం డ్రక్స్ తయారీ కేంద్రంపై యాంటీ నార్కో టిక్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు

సంగారెడ్డి జిల్లా గుమ్మడి దల మండలంలో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని నిండితులు గోసుకొండ అంజిరెడ్డి ప్రభాకర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, క్యాసారం రాకేష్, అనే నలుగురు వ్యక్తులు కలిసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలన్న దురాశతో గుమ్మడిదల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో సర్వేనెంబర్ 174/28లో నిషేధిత అల్పాజోలం తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకొనిసుమారు కోటి రూపాయల విలువ గల ఆల్ఫాజోలం 30 కేజీల ముడి పదార్థాలను తెలంగాణ యాంటీ నార్కిటిక్ బ్యూరో మరియు సంగారెడ్డి జిల్లా పోలీసు సంయుక్తంగా దాడులు చేసి స్వాధీనం చేసుకున్నట్లు చెన్నూరి రూపేష్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు.

40 లక్షల విలువ చేసే 2.6 కేజీల ఆల్ఫాజోలం ముప్పై కేజీల ముడిపర్థలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆల్ఫాజూలం కల్లు కలుపుతారని ఇది చాలా స్లో పాయిజన్ గా పనిచేస్తుందని మీరు తయారు చేసిన ఆల్ఫాజోలం కల్లు దుకాణంలో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు. ఈ డ్రగ్స్ కు బానిసలై విద్యార్థులు అమాయక ప్రజలు మత్తులో తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని వారిని నమ్మిన కుటుంబాలను రోడ్డున పడుతున్నాయని ప్రజలకు విద్యార్థులకు తెలంగాణ ఆంటీ నార్కెటిక్ బ్యూరో పోలీసుల తరఫున ఇలాంటి అసంఘిక కార్యకలాపాలు జరుపుకున్న వారిపై TG-NAB యాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎస్పి తెలిపారు.

కేసులో అంజిరెడ్డి , సాయికుమార్ గౌడ్, ను అరెస్ట్ చేశామని,ప్రభాకర్ గౌడ్ పరారిలో లో ఉండగా క్యాసరం రాజేష్ ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు.తెలంగాణ ఆంటీ నార్కెట్ బ్యూరో డీస్పీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ సంతోష్,పటాన్చెరు డీస్పీ రవీందర్ రెడ్డి, జిన్నారం సీఐ సుధీర్ కుమార్, ఎసై లు మహేశ్వర్ రెడ్డి,విజయ్ రావ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278