సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ లోని ఎస్ వి ఎస్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది
సిలిండర్ ధర 855 రూపాయలైతే అదనంగా 100 రూపాయలు ఎక్కువ తీసుకొని ఆఫీస్ వెనుకల వినియోగదారులను ఉదయం నుండి లైన్లో నిలపెట్టి కూరగాయల అమ్మినట్టు అమ్ముతున్నారు
ఇంటింటికి అంద చేయాల్సిన సిలిండర్ అదనంగా డబ్బులు చెల్లించి కూడా గంటల తరబడి లైన్లో నిలపడి తీసుకోవాల్సిన దుస్థితి ప్రజలకు ఏర్పడింది
ఈ విషయం పై బొల్లారం టౌన్ బీజేపీ అధ్యక్షుడు కె.జె.ఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏ అధికారి పట్టించుకోవటం లేదని అధికారులకు ముడుపులు అందుతున్నాయని అందుకే ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేధని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ విషయం పై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులోకి గ్యాస్ సిలిండర్ పోయేలా చూడాలని అదనంగా వసూలు చేస్తున్న ఏజెన్సీ పై అలాగే పట్టించుకోని అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు