ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గురువారం తిరుపతి నుంచి అమరావతికి తిరిగొచ్చిన ఆయన ఎవరికి ఏయే శాఖలు కేటాయించారో ప్రకటించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నియామకంతో పాటు కీలకమైన పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలను కూడా కేటాయించనున్నట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖగా నాదెండ్ల మనోహర్, టూరిజం, చలనచిత్ర శాఖగా కందుల దుర్గేష్‌ను నియమించనున్నట్లు సమాచారం. పవన్ కోరిక మేరకే రూరల్ శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. లోకేష్ కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
0