తమిళనాడు బీజేపీలో విభేదాలను ఆ పార్టీ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూరు లోక్ సభ స్థానం నుంచి ఓటమిపాలయ్యాక, ఆ విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఈ నేపథ్యంలో, అన్నామలై వ్యతిరేక వర్గం పట్ల బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవాళ ఏపీలో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగ్గా, వేదికపై ఓ అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ గవర్నర్ తమిళిసై వేదికపై ఉన్న బీజేపీ పెద్దలందరికీ అభివాదం చేస్తూ వస్తుండగా, అమిత్ షా ఆమెను దగ్గరికి పిలిచి, వేలు చూపించి కొంచెం సీరియస్ గా మాట్లాడినట్టు వీడియోలో కనిపించింది.
బహుశా అన్నామలైకి వ్యతిరేకంగా ఎవరూ, ఏమీ మాట్లాడొద్దని, క్రమశిక్షణ గీత దాటితే పార్టీ కేంద్ర నాయకత్వం ఏమాత్రం సహించబోదని అమిత్ షా… హెచ్చరిక లాంటిది ఏమైనా చేశారా? అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
0