టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు చాలా ఆనందంగా కనిపించారు. ప్రమాణం తర్వాత ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మోదీని హగ్ చేసుకుని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియొ వైరల్ అవుతోంది. ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
0