డేటింగ్ యాప్స్ వాడుతున్నారా అయితే జాగ్రత్త.. హైదరాబాదులో మొదలైన కొత్తరకం డేటింగ్ స్కామ్ ఇటీవల చాలా మంది అబ్బాయిలు.. అమ్మాయిల మోజులో పడి డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు.. అయితే దాన్నే అలుసుగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు.
అయితే ఇటీవల టిండర్‌లో ఒక అబ్బాయికి రితికా అనే అమ్మాయి పరిచయం అయ్యింది.. పరిచయం అయిన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రావాలని కోరింది.. తర్వాత రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద కలుసు కున్నారు.. అయితే ఆ అమ్మాయి పక్కనే ఉన్న గ్యాలేరియా మాల్ లోని మోష్ క్లబ్ కి వెళ్దామని అతడిని అడిగింది.. అందుకు అంగీకరించిన అతడు అలాగే తనని తీసుకు వెళ్లాడు. అతడిని క్లబ్ లోకి తీసుకు వెళ్లిన ఆమె తియ్యని మాటలు చెప్పి కరిదైన మద్యం ఆర్డర్ చేసి 40505 రూపాయిలు బిల్ చేసింది. మోసపోయిన అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి క్లబ్ యొక్క గూగుల్ రివ్యూస్ చూడగా ఇలాగే మోస పోయిన వేరే యూసర్ రాసిన రివ్యూ చూడగా..
క్లబ్ వాళ్లు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసమని అర్థం చేసుకున్నాడు ఇలాగే ఆ అమ్మాయి మరియు పబ్ చేతిలో చాలా మంది మోసపోయి.. 20 వేల నుండి 40 వేల నష్ట పోయారు.