మంజుమ్మల్ బోయ్స్ సినిమా నిర్మాతలకు సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా నోటీసులు అందజేశారు. గుణ (1991) సినిమాలో తాను స్వరపరిచిన ఓ పాటను ‘మంజుమ్మల్ బోయ్స్’ సినిమాలో అనుమతి లేకుండా వాడుకున్నందుకుగాను ఇళయరాజా ఈ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్ , షాన్ ఆంటోనీ ల అడ్రస్ లకు ఇళయారాజా ఈ నోటీసులు పంపించారు.
గుణ సినిమాలోని ‘కణ్మని అన్బోదు కాదలన్’పాటపై చట్టపరమైన, నైతికమైన ప్రత్యేక హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని ఇళయరాజా ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే తన అనుమతి లేకుండా ఈ సినిమా పాటను మంజుమ్మల్ బోయ్స్ సినిమాలో వాడుకోవడం నేరమని ఇళయరాజా తెలిపారు. ఇప్పటికైనా సదరు నిర్మాతలు తన నుంచి అనుమతి తీసుకోవాలని, రాయల్టీ చెల్లించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో పేర్కొన్నారు.