బొల్లారం మున్సిపల్ పరిధిలోని బొల్లారం ఇండస్ట్రీ ఏరియా “రెడీ మిక్స్”లారీ ఓనర్స్ నవీన్ రెడ్డి, భరత్, దగ్గర కైఫ్ ఆన్సరీ, ఇన్ఫాన్ ఆన్సరీ అనే ఇద్దరు డ్రైవర్స్ గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది… డ్రైవర్స్ కైఫ్ ఆన్సరీ, ఇన్ఫాన్ ఆన్సరీ, కొన్ని అనివార్య కారణాలవల్ల డ్రైవర్స్ ఇద్దరు డ్యూటీ మానేయడం జరిగింది…రెడీమిక్స్ ఓనర్స్ నవీన్ రెడ్డి, భరత్, డ్రైవర్స్ ఇద్దరికీ వేత్తనం 70/- వేల రూపాయలు ఇవ్వకుండా దుర్భాషలాడి డ్రైవర్స్ ని బెదిరించి పంపించేవాడు వాళ్లకు ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి డ్రైవర్ల ద్వారా తెలుసుకొని.
బిఆర్ టి యు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ అతని గురించి తెలుసుకొని రవి సింగ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఎండి కైఫ్ ఆన్సరీ, ఇన్ఫాన్ ఆన్సరీ కి జరిగిన అన్యాయం చెప్పుకున్నారు, ఆ తర్వాత వెంటనే స్పందించిన రవిసింగ్ హుటాహుటిన రెడీమిక్స్ ఓనర్స్ నవీన్ రెడ్డి, భరత్, దగ్గరికి వెళ్లి డ్రైవర్స్ కు రావలసిన వేత్తనం గురించి మాట్లాడి, డ్రైవర్స్ ఒక్కొక్కరికి 35000/-రూపాయలు రాగా ఇద్దరికి కలిపి మొత్తం 70/-వేల రూపాయలు ఇప్పించడం జరిగింది… డ్రైవర్స్ యండి. కైఫ్ ఆన్సరీ, ఇన్ఫన్ ఆన్సరి, మాట్లాడుతూ మాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు… ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు..