వేసవి కాలంలో బీర్లకు డిమాండ్ ఉంటుందని వైన్ షాప్ యజమానులు ఐ ఎం ఎఫ్ ఎల్ నుండి పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టి బీర్లను నిల్వ చేసుకొన్నారు. కానీ వైన్ షాప్ యజమానులు ఆశించిన రీతిలో బీర్ల సేల్స్ కాలేదు. అదీగాక బీర్లు విక్రయించేందుకు ఉన్న కాల పరిమితి ముగిసింది. కాలం చెల్లిన బీర్లను సదరు కంపెనీలకు వాపస్ పంపడమో లేదా ఎక్స్ ఫైరీ డేట్ ముగిసిన బీర్లను ధ్వంసం చేయాల్సి ఉంది. కానీ వైన్ షాప్ యజమానులు ఆర్ధికంగా నష్టపోవడానికి ఇష్టపడక గుట్టుగా వినియోగదారులను మోసం చేసే స్కెచ్ వేసి అమలు పర్చారు.
పెట్టుబడులను నష్ట పోకుండ ఉండేందుకు బీర్లపై ముద్రించిన ఎక్స్ ఫైరీ డేట్స్ కనిపించకుండా ఉండే విధంగా కంప్యూటర్ ద్వారా స్టికర్స్ తయారీ చేసి,బీర్లపై అంటించి దర్జాగా విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఓ మద్యం దుకాణం యాజమాన్యం కాలం చెల్లిన బీర్లు అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా కాలం చెల్లిన, కల్తీ అయిన మద్యాన్ని విక్రయిస్తూ తమ వ్యాపారం సాగిస్తున్నారు ఇదేంటని ప్రశ్నించిన వారికి తమను ఎక్సైజ్ శాఖ అధికారులే అమ్మమని చెబుతున్నారని సమాధానం ఇస్తున్నారు. ఈ ఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లో ఉన్న ఓ వైన్స్ షాప్ లో చోటు చేసుకుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన మద్యం విక్రయించాలని మద్యం ప్రియులు వేడుకుంటున్నారు