manatelanganatv.com

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లాకు .. హైకోర్టు నోటీసులు

Telangana High Court Notices : ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. మేడ్చల్​, జనగాం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్​ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వారి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నామినేషన్​ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్​ సమర్పించిన మల్లారెడ్డి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్​ అభ్యర్థి తోటకూర వజ్రేష్​ యాదవ్​ పిటిషన్​ వేశారు. దీనిపై జస్టిస్​ జె.శ్రీనివారావు విచారణ చేపట్టగా, పిటిషనర్​ తరఫు న్యాయవాది సిద్ధార్థ్​ పోగుల వాదనలు వినిపించారు. రిటర్నింగ్ అధికారికి మల్లారెడ్డి తప్పుడు అఫిడవిట్​ సమర్పించారని తెలిపారు.

Congress Election Petition on Malla Reddy : సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని అఫిడవిట్​లో పేర్కొన్నారని, రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి లాగా ఉందన్నారు. మల్లారెడ్డి హిందూ అవిభాజ్య కుటుంబ పెద్దగా ఉన్నట్లు చెప్పారని తెలిపారు. బ్యాంకు ఖాతాలు లేవని అఫిడవిట్​లో తెలిపారని వివరించారు. బ్యాంకు ఖాతాలు లేకుండా ఆదాయపు పన్ను రిటర్ను ఎలా దాఖలు చేస్తున్నారో వివరాలు వెల్లడించలేదని కోర్టుకు వివరించారు..

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278