కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు.
కాగా, ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మొన్ననే ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అస్సాం కాంగ్రెస్ యూనిట్ వార్ రూమ్ కోఆర్టినేటర్ రితోమ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా మరో 10 మంది కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా, ప్రేమేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.