తెలంగాణలో పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం పొడిగించింది. తెలంగాణలో మే 13న పోలింగ్ ఉంది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ తేదీని గంటపాటు పొడిగించింది. దీంతో ఆ రోజున పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
వడగాలులు, ఎండల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు పోలింగ్ సమయాన్ని ఈసీ పెంచింది. తెలంగాణలో తీవ్ర ఎండలు ఉండటంతో మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగైదు గంటల వరకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఈసీ పోలింగ్ సమయాన్ని పొడిగించింది.