ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదారబాద్ జట్టు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక తన తరువాతి మ్యాచ్‌ను హైదరాబాద్ గురువారం రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. సొంతమైదానం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజగా గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో సన్ రైజర్స్ క్రికెటర్లు సందడి చేశారు. జయదేవ్ ఉనద్కత్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, టీ. నటరాజన్, అబ్దుల్ సమద్‌లు మాల్లో షాపింగ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ అభిమాన ఆటగాళ్లతో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.