కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్‌ను ప్రకటించారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బండి నామినేషన్ అనంతరం కరీంనగర్ లో సంజయ్ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. తాను కరీంనగర్‌లో స్థానికుడని, బీఆర్‌ఎస్ అభ్యర్థి నాన్‌లోకల్ అని, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా గుర్తు లేదన్నారు. తనను ఓడించేందుకు రెండు పార్టీలు చేతులు కలిపాయన్నారు. కరీంనగర్ కలెక్షన్ ఏరియాలో రూ. రూ.12 వేల కోట్లతో అనేక నిర్మాణ పనులు చేపట్టామని… జిల్లా ప్రజలు తనను ఆదరిస్తున్నారని చెప్పారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం మొత్తం ప్రధాని మోదీ వైపు చూస్తోందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని అన్నారు. మళ్లీ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.