Viral News : మా ఇంట్లో పెండ్లికి మీరిచ్చే బహుమానం మోడికి ఓటు వెయ్యడం అంటూ వివాహ ఆహ్వన పత్రికలలో ప్రధాని మోది ఫోటో ముద్రించి బంధుమిత్రులను ఆహ్వనిస్తున్నాడు ఓ బీజేపీ నాయకుడు. మేడ్చల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు తన సోదరుడి కుమారుడి విశాహం ఉండటంతో ఆహ్వాన పత్రికలో వధువరూలు, పెండ్లి పెద్దలు ముద్రించి కార్డులో ప్రత్యేకంగా ప్రధాని మోది ఫోటో ముద్రించి మా పెళ్ళికి మీరు ఇచ్చే బహుమానం మోడి గారికి ఓటు వేయ్యడం అంటూఅందరిని ఆహ్వనిస్తున్నారు. స్వతహగా బీజేపీ నాయకుడు కావడంతో బంధువులకు,మిత్రులకు ఆహ్వన పత్రికలు ఇచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎంటో ఎన్నికల సిత్రాలు గాని పచ్చటి పందిరిలో సైతం రాజకీయం రాజ్యమెళుతుంది.
0