మేడ్చల్ జిల్లా: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం మున్సిపల్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది పనితీరుపై అత్యవసర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాజ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు ఎవరు కూడా చెత్తని రోడ్లపై వేయరాదని వేసిన వారికి భారీ జారినామా విధిస్తామని హెచ్చరించారు వచ్చే వర్షాకాలం ని దృష్టిలో పెట్టుకొని రోడ్లపై చెత్త వేయడం ద్వారా నాళాలు మూసుకొని ఇళ్లలోకి నీరు చేరుతుందని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచకపోతే ప్రజలు రోగాల బారిన పడతారని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎవరు కూడా రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపల్ బండ్ల లో వేయాలని సూచించారు.
0