ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయి.
– పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో.. బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్ తారామతిపేట పంచాయతీలు విలీనం
– శంషాబాద్ మున్సిపాలిటీలో.. బహదూర్‌గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ విలీనం
– నార్సింగి మున్సిపాలిటీలో.. మీర్జాగూడ గ్రామపంచాయతీ
– తుక్కుగూడ మున్సిపాలిటీలో.. హర్షగూడ గ్రామపంచాయతీ
– మేడ్చల్ మున్సిపాలిటీలో.. పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతీలు
– దమ్మాయిగూడ మున్సిపాలిటీలో.. కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి
– నాగారం మున్సిపాలిటీలో.. బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు
– పోచారం మున్సిపాలిటీలో.. వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల,కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం
ఘట్కేసర్ మున్సిపాల్టీలో.. అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్,ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనం
– గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో..మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు , 8 తూంకుంట మున్సిపాలిటీలో.. బొంరాసి పేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం
0