దుందిగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛధనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం దుందిగల్ మున్సిపాలిటీ 27వ వార్డు దుందిగల్ తాండ 2లో కౌన్సిలర్ శంకర్ నాయక్ పాల్గొని పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం వలన లాభాలు తదితర అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించారు.అనంతరం కౌన్సిలర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వలన డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. నాళాలలో వ్యర్థ పదార్థాలను వేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి శాంత ప్రైమరి స్కూల్ టీచర్ పిఎన్ ఆర్ విద్యార్థులు స్థానిక మహిళాలు నాయకులు పాల్గొన్నారు
0