అల్లు అర్జున్‌కు హైకోర్టులో రిలీఫ్ అందింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇంతకీ ఏం జరిగింది?
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా నిన్న అంటే డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అదే సమయంలో ఈ సినిమా ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్లో బుధవారం రాత్రి ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు.దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. రేవతి ఆ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.