మోహన్ బాబు ఫామ్ హౌస్ లో జల్ పల్లి ఫాంహౌస్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో మీడియాకు లీక్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఓ బౌన్సర్ ఇద్దరు యువకులపై దాడి చేయడం కనిపిస్తోంది. పెదరాయుడి తరహాలో మోహన్ బాబు కుర్చీలో కూర్చుని ఉండగా.. చుట్టూ జనం నిలబడి ఉన్నారు. ఈ వీడియోను మేడ పై నుంచి తీసినట్లు తెలుస్తోంది. ఎవరు తీశారనే విషయం మాత్రం తెలియరాలేదు. కాని మోహాన్ బాబే దగ్గరుండి ఇద్దరు కుర్రాళ్లను బౌన్సర్లతో కొట్టిస్తున్నారు. ఇదే అక్కడున్న వీడియో.
మోహన్ బాబు ఫాంహౌస్లో ఆరు బయట కుర్చీలో కూర్చుని ఉండగా ఓ బౌన్సర్ ఇద్దరు యువకులపై దాడి చేశాడు
చెంపపై కొడుతూ ఆ యువకుల సెల్ ఫోన్లు లాక్కున్నాడు. మోహన్ బాబు కళ్లముందే ఈ దాడి జరగడం గమనార్హం. చుట్టు చాలా మంది కుర్రాళ్లు ఉన్నారు. కాని ఎవ్వరు ఎందుకు కొడుతున్నారో…తెలీదు కాని వీడియో మాత్రం వాళ్లకి తెలీకుండా సీక్రెట్ తీసి పోస్ట్ చేశారు. సాంబశివారెడ్డి పేరం అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశాడు.