తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకోసం ప్రతిఏటా మహిళకు వడ్డీలేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం ప్రతి ఏడాది రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల మేర రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
07/12/2024
రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశిధర్ రావు తదితరులు సాదర స్వాగతం పలికారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులున్నారు.
రాష్ట్రంలో గురుకుల, సంక్షేమ పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిలోనే గురుకులాల పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వంలో సంబంధిత శాఖలకు మంత్రి లేకపోవడంతో కొందరు అధికారులు ఆడింది ఆటగా నిర్వహణ సాగుతున్నది. అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆగం చేస్తున్నాయి. అడ్డగోలు విధానాలతో గందరగోళంగా మారిన గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే దుస్థితి నెలకొన్నది. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు ఆహారం కలుషితమై మృతి చెందారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ గురుకుల వసతి గృహంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పేదలకు మెరుగైన విద్య అందించాల్సిన పాఠశాలలు విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకులాల్లో విద్యాబోధన చేసింది. తెలంగాణ గురుకులాలు దేశానికి దిక్సూచిగా మారాయి. పిల్లలను గురుకుల, సంక్షేమ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పోటీపడ్డారు. కానీ కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకులాలు గాడితప్పాయి. అన్నమో రామచంద్రా అంటూ విద్యార్థులు రోడ్డెక్కితే.. మీకు తిండి పెట్టేందుకు ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వలేదుఅని అధికారులు చిన్నారులను చీత్కరించుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. సాంఘిక సంక్షేమ, మైనారిటీ, గిరిజన సంక్షేమశాఖలకు ప్రత్యేకంగా మంత్రి కూడా లేరంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ శాఖలన్నీ సీఎం రేవంత్‌రెడ్డి వద్దనే ఉండటం, పర్యవేక్షణ లేకపోవడం, విధాన నిర్ణయాల్లో ఆలస్యంతో సమస్యలు నెలకొన్నాయి. బీసీ సంక్షేమ గురుకులాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నా తాను పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
గురుకులాలు, సంక్షేమ పాఠశాలల్లో కలుషితాహారంతో విద్యార్థుల మృతి, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలకు సంబంధితశాఖ పర్యవేక్షణ లేకపోవడమే కారణమని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో పని వేళలను మార్చడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్తున్నారు. బోధనకు సంబంధం లేని పనుల బాధ్యతలను తమకు అప్పగించడంపై టీచింగ్‌పై ఏకాగ్రత పెట్టలేకపోతున్నామని ఉపాధ్యాయులు చెప్తున్నారు. విద్యార్థులతో పాటు తాము కూడా ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు.
హిందూ మహాసముద్రం, దాని పక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇకపోతే శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతూ, ఈ నెల 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ అభివృద్ధి చెందుతున్న వాతావరణ నమూనా ఫలితంగా, నవంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 12వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి బాబా ఆలయ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మలిపెడద్ది సుదీర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కౌడే మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఉదండపురం సత్యనారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు
సాయి బాబా ఆలయ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి బాబా ఆలయ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఓ అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్ గా ఆయన్ని నియమించింది. ఈ పదవి గురించి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పదవిలో దిల్‌రాజు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
దిల్ రాజుఅసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి అనే సినిమాతో పంపిణీదారుడిగా దిల్‌రాజు కెరీర్ మొదలు పెట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు దిల్‌రాజుగా మారింది. టాలీవుడ్లో ఎన్నో విజయవంతమై చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్త వారికి ఛాన్సులు ఇస్తారు.ఇటీవల ఆయన అవకాశమిచ్చిన బలగం సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. సుహాస్ నటించిన జనక అయితే గనక అనే మూవీని కూడా నిర్మించగా.. మంచి టాక్ అందుకుంది. సినిమా ఇండిస్ట్రీకి కొత్తగా వస్తున్న వారిని ప్రొత్సహించేందుకు దిల్‌రాజ్ సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు.. కొత్త టాలెంట్‌ను ప్రొత్సహిచేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో కొత్త బ్యానర్ క్రియేట్ చేస్తున్నామని ఇటీవలే ఆయన ప్రకటించారు.
అందు కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను లాంచ్ చేస్తానని తెలిపారు..ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. రామ్‌చరణ్- శంకర్ల కాంబోలో భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నారు.
ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. కాగా, ప్రస్తుతం దిల్‌రాజ్ తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.
రైతులు అడుక్కుంటారా? పొద్దస్తమానం అవే ప్రశ్నలా?.. మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు
సూర్యాపేట జిల్లా పర్యటనలో రైతులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నోరు పారేసుకున్నారు. డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా, రుణమాఫీపై అదిగో.. ఇదిగో.. అంటూ కాలం వెళ్లదీస్తూ అడ్డగోలుగా మాట్లాడడంపై రైతులు మండిపడుతున్నారు. కోదాడ మండలం కాపగల్లు గ్రామంలో రోడ్డు పనుల శంకుస్థాపనలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి తుమ్మల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘రైతులు డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి. అంతేగానీ, పొద్దాక నాకు రైతుబంధు రాలేదు.. రైతు బీమా రాలేదు.. రుణమాఫీ కాలేదు.. అని అడుక్కుతినే బతుకు మనకు అవసరం లేదు. వ్యవసాయదారులది ఎప్పుడూ దానం చేసే గుణమే తప్ప, ఈ జాతికి అడుక్కునే అవసరాలు లేవు’ అంటూ అడ్డగోలుగా మాట్లాడారు. మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై గ్రామ రైతుల భగ్గుమంటున్నారు.