కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండలం చర్చి గాగిలాపూర్ సర్వే నెంబర్ 214 లోని అక్రమ నిర్మాణాలు జోర్ అందుకున్నాయి. పాట పగలే దర్జాగా అక్రమ నిర్మాణాలు చెప్పాడు లక్షలు డందుకుంటున్నారు. రెవిన్యూ అధికారులు మాత్రం తమకు ఏమి తేలినట్టు చేతులు దులుపుకుంటున్నారు. అసలు రెవిన్యూ అధికారులు ఉ న్నారా లేరా అంటు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు మాయం అవుత్తున అధికారులు మాత్రం ఎలాటి స్పందన ఇవ్వటం లేదు ఇప్పటికైన అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ భూములు కాపాడాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
13/11/2024
నకిలీ కాల్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వ టెలికాం శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇటీవల డిపార్ట్మెంట్ 1.77 కోట్ల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది. ఫేక్ కాల్స్ చేయడానికి వీటిని ఉపయోగించారు. దేశంలోని 122 కోట్ల మంది టెలికాం వినియోగదారులను రక్షించేందుకు ట్రాయ్ (TRAI) సహకారంతో టెలికాం శాఖ ఈ చర్య తీసుకుంది. ట్రాయ్ గత నెలలో కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా ఆపరేటర్లు ఇప్పుడు మార్కెటింగ్, నకిలీ కాల్‌లను స్వయంగా ఆపవచ్చు. దీంతో వైట్‌లిస్టింగ్ అవసరం ఉండదు.
టెలికాం డిపార్ట్మెంట్ ప్రకారం.. ప్రతిరోజూ దాదాపు 1.35 కోట్ల ఫేక్ కాల్స్ ఆగిపోతున్నాయి. ఇది కాకుండా ఫేక్ కాల్స్ చేస్తున్న 1.77 కోట్ల మొబైల్ నంబర్లను డిపార్ట్మెంట్ బ్లాక్ చేసింది. ప్రజల ఫిర్యాదులపై శాఖ చర్యలు చేపట్టి ఐదు రోజుల్లోనే సుమారు 7 కోట్ల కాల్‌లను నిలిపివేసింది. ఇదే తమ ప్రచారానికి నాంది అని ఆ శాఖ పేర్కొంది.
నకిలీ కాల్స్ చేసేవారిని LICOM డిపార్ట్మెంట్ ఆపడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కూడా లక్షల సిమ్ కార్డులను క్లోజ్ చేశారు. ఫేక్ కాల్స్‌ను అరికట్టేందుకు ఆ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇక నుండి, కాలర్లు వైట్‌లిస్ట్ చేయబడిన టెలిమార్కెటింగ్ కాల్‌లను మాత్రమే స్వీకరిస్తారు.
11 లక్షల ఖాతాలు స్తంభించాయి
తాజాగా, దాదాపు 11 లక్షల ఖాతాలను బ్యాంకులు, పేమెంట్ వాలెట్లు స్తంభింపజేశాయని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)తో కలిసి పనిచేస్తున్న నలుగురు టెలికాం సర్వీస్ ఆపరేటర్లు (టీఎస్పీలు) 45 లక్షల నకిలీ అంతర్జాతీయ కాల్‌లను టెలికాం నెట్‌వర్క్‌కు చేరకుండా నిరోధించారు.
ఇండ్లను కూల్చడం రాజ్యాంగ వ్యతిరేకం.. అధికారులకు పెనాల్టీ విధించాలి: సుప్రీంకోర్టు
న్యాయంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జిక్యూటివ్ అధికారులు న్యాయ ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. నిందితులను దోషిగా చిత్రీకరించలేమని, దాని ఆధారంగా వాళ్ల ప్రాపర్టీలను నాశనం చేయడం సరికాదు అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కేవలం నిందితులో లేక దోషులో అయినంతమాత్రానా, వాళ్ల ఇండ్లను కూల్చడం రాజ్యాంగవ్యతిరేకమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది.
వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను అక్రమంగా కూల్చుతున్నారని వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు న్యాయవిచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుల్లో తీర్పును ఇచ్చింది. నిందితుల ఇండ్లను కూల్చడం రాజ్యాంగ వ్యతిరేకం అని, అలాంటి చర్యలకు పాల్పడిన అధికారులపై పెనాల్టీ వేయాలని కోర్టు సూచించింది.
నిందితులు, దోషులకు కొన్ని హక్కులు ఉంటాయని కోర్టు చెప్పింది. బుల్డోజర్ల న్యాయంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రికి రాత్రే మహిళలు, చిన్నారులను వీధుల్లో చూడడం సంతోషకరమైన అంశం కాదు అని కోర్టు వెల్లడించింది. ఇండ్లను, అక్రమ ప్రాపర్టీలను ధ్వంసం చేసే ప్రక్రియను వీడియో తీయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ప్రజాభూమిలో అక్రమ నిర్మాణం చేపడితే తమ ఆదేశాలు ఆ కేసుల్లో అమల్లోకి రావు అని కోర్టు తెలిపింది.
రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని.. ప్రభుత్వానికి త్వరలో 70 ఎంఎంలో సినిమా చూపించబోతున్నామని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మంగళవారం చేపట్టిన పాదయాత్రలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన హరీష్ రావు.. రైతుల కష్టాలు చూడలేక ఎమ్మెల్యే సంజయ్ కోరుట్ల నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర చేపట్టారని చెప్పారు.
నాడు డాక్టర్‌గా.. నేడు ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ మంచి పేరు తెచ్చుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్‌కు దేశంలోనే రైతు సీఎం అనే పేరు వస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతుల సీఎం అనే పేరు వచ్చిందంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్కటైనా పనికొచ్చే పనైనా చేశారా.. అంటూ విమర్శించారు. జగిత్యాల అంటేనే జైత్రయాత్ర గుర్తుకు వస్తుందని.. అదే జగిత్యాలలో మా ఎమ్మెల్యే పూరించిన సమర శంఖంతోనైనా రేవంత్ కళ్లు తెరిస్తే చాలని హరీష్ అన్నారు.
రైతులు వడ్ల లోడు ఎత్తమని అడుగుతుంటే.. రేవంత్ మాత్రం మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్ ఎత్తుతున్నాడని హరీష్ రావు సెటైర్ వేశారు. మూసీ దగ్గర కాదు.. కూల్చేసిన ఇండ్ల దగ్గర సీఎం రేవంత్ పాదయాత్ర చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. దమ్ముంటే ఇళ్లు కూలిన చోట పాదయాత్ర చేయాలని.. అక్కడికి తాము కూడా వస్తామని హరిశ్ రావు సవాల్ చేశారు. మూసీ కంపు కంటే సీఎం రేవంత్ నోటి కంపే ఎక్కువగా ఉందని విమర్శలు కురిపించారు.
సీఎం రేవంత్ చేసిన పాపం ప్రజలకు తగలకుండా చూడమని వేములవాడకు పోయి మొక్కి వచ్చినా.. ఇక్కడి నుంచి ధర్మపురి, కొండగట్టు, కోటిలింగాల దేవుళ్లకు మొక్కుతున్నానని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తప్ప.. మిగిలిన అన్నీ గ్యారెంటీలు తుస్సేనంటూ హరీష్ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు మాటలెక్కువ, చేతలు తక్కువని తీవ్ర విమర్శలు చేశారు.
కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు. నరేందర్ రెడ్డి అరెస్ట్.. రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసిందని చెప్పారు.
కేటీఆర్ ట్విట్టర్ (X)లో.. “తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది.
రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసింది. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొండంగల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజుకున్న మంట ఇంకా రగులుతూనే ఉంది.. నిన్న కలెక్టర్ సహా పలువురు అధికారులపై దాడి ఘటనలో ఓ పక్క అరెస్టులు జరుగుతున్నాయి. అటు.. రైతులు కూడా పోరుబాట ఆపేదే లేదంటూ చెప్తున్నారు. భూసేకరణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారడానికి కారణాలేంటనే దానిపై విచారణ జరుగుతోంది.
సోమవారం లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో 55 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. కలెక్టర్‌పై దాడి చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దాడులకు ప్రోత్సహించేవారిని కూడా వదిలిపెట్టబోమన్నారు. దాడి చేసిన వారికి అండగా ఉన్న వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఎంతటి వారైనా ఉచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించారు. అధికారులను చంపాలని చూస్తున్న వారిని బీఆర్ఎస్ ఎలా సమర్థిస్తుందని మండిపడ్డారు. అమృత్ టెండర్లపై బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవమని, అభ్యంతరాలు ఉంటే లీగల్‌గా ఫైట్ చేయండని అన్నారు. సృజన్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అల్లుడని అన్నారు. గవర్నర్ అనుమతి రాగానే పలువురిపై చర్యలు ఉంటాయని అన్నారు.
గతంలో చంద్రబాబునాయుడు పదేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది..మరో పదండ్లు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వంతు వచ్చింది. రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలో ఉంటుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ కాంగ్రెస్ పార్టీ తన విధాఆన్ని మార్చుకోవాలి. టెస్ట్ మ్యాచ్ లెక్క కాకుండా టీ 20మ్యాచ్‌లలా పని చేయాలి అని చెప్పారు. తన లక్ష్యం నాలుగు కీలక ప్రాజెక్టులని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనం దాని చుట్టూ హైదరాబాద్ అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి తీరుతానని అన్నారు. గుజరాత్ మోడల్ కంటే తెలంగాణ మోడల్ వెలిగిపోతోంది. దేశంలో గుజరాత్ మోడల్ కు ప్రత్యామ్నాయం తెలంగాణ మోడల్ గా తీర్చి దిద్దుతా. నా పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు సీయోను, న్యూయార్క్ నగరాలతోనే అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరుగారింటిల అమలుతోపాటు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అనే మరో ఏడూ హామీలు కూడా అమలు చేస్తున్నాం అన్నారు రేవంత్. అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ సుపరిపాలన అందించటమే నా లక్ష్యం అని చెప్పారు.
సర్పంచి ఎన్నికకు కూడా బిజెపి మోడీ జపం చేస్తోంది. దేశంలో ఏ ఎన్నికైన మోడీ వర్సెస్ రాహుల్ అనే విధంగా జరగాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అభివృద్ధిని మోడీ నాశనం చేస్తున్నారు.
ఆ రాష్ట్రాలకు పెట్టుబడులు రాకుండా తన సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలించకపోతున్నారు. మోడీ గుజరాత్ కు ప్రధానిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ కు రావలసిన పెట్టుబడులను గుజరాత్ అహ్మదాబాద్ కు తరలిస్తున్నారు అంటూ మోదీపై మండిపడ్డారు. తాజా జనాభా లెక్కల సేకరణ, దాని ఆధారంగా నియోజకవర్గం పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి దక్షిణాది రాష్ట్రాల అవసరమే లేకుండా పోతుంది. అందుకే 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని తెలంగాణ సీఎం డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ కవల పిల్లలు..
నితీష్ కుమార్, చంద్రబాబునాయుడు దయతో మోడీ ప్రభుత్వం నడుస్తోంది. వాళ్ళిద్దరూ అనుకుంటే ఒక సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ లు అయితే కవల పిల్లలు అంటూ రేవంత్ దుయ్యబట్టారు. ఏసీబీ గవర్నర్ కు లేఖ రాసి 15 రోజులైంది. ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు కేటీఆర్ రెండు రోజులు ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. ఆయన వచ్చి వెళ్లిన వెంటనే గవర్నర్ ను ఢిల్లీని పిలిపించినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు గవర్నర్ దగ్గర నుంచి జవాబు రాలేదని రేవంత్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బీజేపీ మరో కీలక బాధ్యత అప్పజెప్పింది. పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ ప్రయాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీతో బీజేపీ జట్టుకట్టి.. మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన సంగతి అందరికీ తెలిసిన సంగతే. తాజాగా బీజేపీ పవన్ కళ్యాణ్‌కు మరో బాధ్యత అప్పగించింది.
ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి ఫోకస్ మాత్రం మహారాష్ట్ర ఎన్నికలపై గట్టిగా ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు అటు కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ.. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్‌ను బరిలోకి దించనున్నట్లు సమాచారం.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను కోరింది. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు నవంబర్ 16,17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.