లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జానీ మాస్టర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు
.కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లిలోని పోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్‌కు రిమాండ్ విధించగా.. ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు గోల్కొండ ఆస్పత్రిలో జానీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉప్పరిపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో.. కోర్టు రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.