వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలను చేపట్టి రికార్డు పుటల్లోకెక్కిన మోదీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఏకధాటిగా 98 నిమిషాల పాటు ప్రసంగించారు. అంటే… ఆయన ప్రసంగం గంటన్నరకు పైగా కొనసాగింది. 2016లో ఆయన 96 నిమిషాల పాటు ప్రసంగించి అత్యధిక సమయం ప్రసంగించిన పీఎంగా ఘనత సాధించారు. ఇప్పుడు ఆయన రికార్డును ఆయనే అధిగమించారు. 1947 లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 72 నిమిషాల పాటు ప్రసంగించారు. మోదీకి ముందువరకు నెహ్రూదే అత్యధిక సమయం ప్రసంగించిన రికార్డు. నెహ్రూకు మరో రికార్డు కూడా ఉంది. 1954లో అత్యల్పంగా 14 నిమిషాలు మాత్రమే ఆయన ప్రసంగించారు. 1966లో ఇందిరాగాంధీ కూడా 14 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.
15/08/2024
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిస్తే.. జైలు శిక్షలు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉంచిన ఇద్దరికీ జైలు శిక్ష వేసింది కోర్టు. ఈ సంఘటన మెహిదీపట్నం ఎల్ఐసీకాలనీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెహిదీపట్నం ఎల్ఐసీకాలనీలోని మండీటౌన్ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచడంతో క్యాషియర్ మహ్మద్ ఇర్ఫాన్(19)పై పోలీసులు కేసు పెట్టారు.
అనంతరం 4వ ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. దీంతో ఇర్ఫాన్‌కు 14 రోజుల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి డీసీ ఉమాపతిరావు. ఆసిఫ్ నగర్‌లోని సయ్యద్ అలీగూడలో ఫ్రెండ్స్ పాస్ట్ ఫుడ్ సెంటర్‌ను అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి ఉంచడంతో నిర్వాహకుడు మహ్మద్ ముజీబ్ (32) పై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మహ్మద్ ముజీబు 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఉచిత పథకాలకు ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటుంది కానీ భూసేకరణలో బాధితులకు చెల్లించేందుకు మాత్రం డబ్బు లేదా’ అంటూ మహారాష్ట్ర సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవై ఏళ్లుగా బాధితుడికి డబ్బు చెల్లించకపోవడంపై సీరియస్ అయింది. మూడు వారాల్లోగా పరిహారం చెల్లించకపోతే మహారాష్ట్రలో ఉచిత పథకాలను నిలిపి వేయాలంటూ ఆదేశాలిస్తామని హెచ్చరించింది. ఈమేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలోని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
అసలు ఏం జరిగిందంటే..
పూణేకు చెందిన ఓ వ్యక్తి భూమిని రక్షణ శాఖ అవసరాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఆ భూమిలో డీఆర్డీవోకు అనుబంధంగా ఉన్న ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ ఇనిస్టిట్యూట్ కు కేటాయించింది. ఇదంతా జరిగి అరవై ఏళ్లు కావొస్తోంది. అయితే, భూసేకరణ నిబంధనల మేరకు జరగలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం మాత్రం ఇవ్వలేదని చెప్పాడు. దీనిపై కోర్టును ఆశ్రయించగా వడ్డీతో కలిపి బాధితుడికి చెల్లించాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం స్పందించి బాధితుడికి రూ.37.42 కోట్ల పరిహారం ఆఫర్ చేసింది. అయితే, పరిహారం ఇవ్వడంలో జరిగిన జాప్యాన్ని ప్రస్తావిస్తూ.. తమకు రూ.317 కోట్లు ఇవ్వాలంటూ బాధితుడు డిమాండ్ చేశాడు. దీనిపై ప్రతిష్టంభన నెలకొంది.
ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడంతో బాధితుడు మరోమారు సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. తాజాగా ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. బాధితుడికి వెంటనే పరిహారం చెల్లించకపోతే మహారాష్ట్రలో ఉచిత పథకాలు నిలిపేయాలంటూ ఆదేశాలిస్తామని హెచ్చరించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన లాయర్ మూడు వారాల గడువు కోరారు. ఈ గడువు మంజూరు చేస్తూ.. ఆ తర్వాత కూడా పరిహారం చెల్లించకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని సుప్రీం బెంచ్ హెచ్చరించింది.
బోయిన్ పల్లి మాలిక్ మోటార్స్ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
78వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా బోయిన్ పల్లి మాలిక్ మోటార్స్ సిబ్బంది షోరూమ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జెండా వందనం చేసి స్వీట్స్ పంచారు. అనంతరం బోయిన్ పల్లి నుండి ఆర్.సి పురం వరకు జాతీయ జెండా లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశ, రాష్ట్ర ప్రజలందరికి 78 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో కార్తీక్, అఖిలన్, రషిద్, విజయ్, శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ముందుగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అని అన్నారు.
హర్‌ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయన్నారు. దేశం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలకు ఈ దేశం రుణపడి ఉందని పేర్కొన్నారు.
శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని, స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్ల మంది పోరాడారని గుర్తు చేశారు. ఇవాళ దేశ జనాభా 140 కోట్లకు చేరుకుందని, మనమంతా వారి కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని తెలిపారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది వేడుకలకు దాదాపు ఆరు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
వీరిలో రైతులు, యువత, మహిళలు, గిరిజన సంఘాల నాయకులు సహా అనేక మందికి ఆహ్వానం పంపారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించడం జరిగింది.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నాణ్యతలేని అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు కొందరు నిర్వాహకులు. అధికారులు ఎన్ని దాడులు చేస్తున్న గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో చాటుగా నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు ఓ కేటుగాడు. విచిత్రం ఏమిటంటే అల్లం లేకుండానే వెళ్లుల్లిపాయలతో పేస్ట్ తయారు చేసి అల్లం కలర్ వచ్చేలా ఫుడ్ కలర్ కలిపి కల్తీ పేస్ట్ తయారు చేస్తూ ప్రజా ఆరోగ్యాలతో కలగటం ఆడుతున్నాడు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెళ్లి లో ఓ పురాతన ఇంట్లో ఈ దందా సాగిస్తున్నాడు ఓ ప్రభుద్దుడు. ఇదేటని ప్రశ్నిస్తే ఈ తయారీ కేంద్రానికి అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తున్నాడు. ప్రజనివాసాల నడుమ ఇలాంటి నాసిరకం తయారి కేంద్రాలు వెలుస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను పలు అనుమానాలకు దారి తీస్తున్నాయు. ఇలాంటి అనుమతులు లేని నాసిరకం తయారీ కేంద్రాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ ప్రజలు కోరుకుంటున్నారు.